సుధీర్ హీరోగా యస్ యమ్ యస్ ప్రారంభం
on May 5, 2011
సుధీర్ హీరోగా నటిస్తున్న"యస్.యమ్.యస్." ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ
మేనల్లుడు సుధీర్ ను హీరోగా పరిచయం చేస్తూ, రజీనాని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, తాతినేని సత్య దర్శకత్వంలో,
ఘట్టమనేని ప్రియ నిర్మిస్తున్న చిత్రం"యస్.యమ్.యస్." "యస్.యమ్.యస్." అంటే " శివ మనసులో శృతి" అని అర్థమని ఈ
చిత్రం యూనిట్ తెలిపింది.
సుధీర్ హీరోగా నటిస్తున్న"యస్.యమ్.యస్." చిత్రానికి ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తూండగా, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ హీరోగా నటిస్తున్న"యస్.యమ్.యస్." చిత్రానికి సెల్వ గణేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుధీర్ హీరోగా నటిస్తున్న"యస్.యమ్.యస్." చిత్రానికి చిట్టిబాబు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. సుధీర్ హీరోగా నటిస్తున్న"యస్.యమ్.యస్." చిత్ర దర్శకులు తాతినేని సత్య గతంలో ఇదే బ్యానర్ లో "భీమిలీ కబడ్డి జట్టు" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.