సుబ్రమణ్యం..అదిరిందయ్యా నీ టైమింగ్..!!
on Sep 26, 2015
మంచి సినిమా తీయడం ఎంత కీలకమో, సరైన సమయంలో విడుదల చేసుకోవడం కూడా అంతే కీలకమని సుబ్బమణ్యం ఫర్ సేల్ మరోసారి నిరూపించింది. ఓవరాల్‌గా ఇది ఓకే ఒకే సినిమా. చూసి తీరాల్సిందే అనేంత గొప్ప సినిమా కాదని క్రిటిక్స్ తేల్చేసిన ...ఈ సినిమా వసూళ్లు మాత్రం భారీగానే దక్కుతున్నాయి. దీనికి కారణం ఈ సినిమా సరైన సమయంలో రిలీజ్ కావడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
తొలి రెండు రోజుల్లో దాదాపుగా రూ.8 కోట్లు వసూలు చేసిందీ చిత్రం. శని, ఆదివారాలు కలిపితే.. కనీసం రూ.15 కోట్లు వచ్చేస్తాయి. అంటే… పెట్టుబడి మొత్తం తొలివారమే తిరిగొచ్చేస్తుందన్నమాట. శాటిలైట్ రూపంలో నిర్మాతకు మంచి లాభమే వచ్చింది. శుక్రవారం బక్రీద్ సెలవు దొరకడం చిత్రానికి బాగా కలిసొచ్చింది. అలాగే ఈ సినిమాకి పెద్దగా పోటీ లేకపోవడం కూడా బాగా కలిసివచ్చింది. మొత్తానికి సుబ్రమణ్యం టైమింగ్ అదిరిందని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.