మహేష్ బాబు,రాజమౌళి మూవీ స్టార్ట్ అయ్యింది
on Jan 2, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో తెరకెక్కే మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా భారతీయ సినీ ప్రేమికులు మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ళందరికి ఒక గుడ్ న్యూస్.
నూతన సంవత్సరం కానుకగా ssmb 29 ఈ రోజు హైదరాబాద్ లోని అల్యూ మినియం ఫ్యాక్టరీ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తో పాటు రాజమౌళి మరియు చిత్ర బృందం పాల్గొంది.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వేసవి నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి.
అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీ ద్వారా రాజమౌళి ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు.దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ అనే టాక్ అయితే ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also Read