కొడుకును డైరెక్టర్ కాకుండా అడ్డుకుంటున్న రాజమౌళి
on Feb 9, 2017
ప్రజంట్ టాలీవుడ్లో వారసుల అరంగేట్రాలు ఎక్కువవుతున్నాయి...హీరోల కొడుకులు హీరోలుగా, హీరోయిన్ల కూతుళ్లు హీరోయిన్లుగా వెండితెరకు పరిచయమవుతున్నారు. అలాగే డైరెక్టర్ల తనయులు కూడా మొదట హీరోలుగా ట్రై చేసినా చివరికి మెగాఫోనే పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఓటమి అంటే ఏంటో తెలియని డైరెక్టర్‌గా... తెలుగు సినిమా స్టామినాని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కుమారుడు కార్తీకేయ ఇప్పుడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు..
ఇప్పటికే షార్ట్‌ఫిల్మ్స్‌తో పాటు తండ్రి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసి అనుభవాన్ని సంపాదించాడు కార్తీకేయ. ఇది చూసిన వారంతా ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికాడు అంటున్నారు..కానీ కొడుకు కోసం మరో ఫ్లాట్‌ఫాం రెడీ చేస్తున్నాడు జక్కన్న..ఇటీవల ప్రారంభమైన నాగచైతన్య-సాయికొర్రపాటి-సురేష్‌బాబు కాంభినేషన్లో తెరకెక్కనున్న మూవీకి కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడట. చూస్తూ ఉంటే కొడుకును స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది..లేదంటే డైరెక్టర్‌గా వెళ్లడం కార్తీకేయకి ఇష్టం లేదా..? అని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు.