ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
on May 2, 2024
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) ల సినీ కెరీర్ దాదాపు ఒకే సమయంలో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ రెండో చిత్రం 'స్టూడెంట్ నెం.1'తో రాజమౌళి దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో 'సింహాద్రి', 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. రెండు దశాబ్దాలుగా వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరిగా ఎన్టీఆర్-రాజమౌళి ద్వయాన్ని భావిస్తారు అందరూ. అలాంటిది ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదంటూ రాజమౌళి తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
బుధవారం సాయంత్రం జరిగిన 'కృష్ణమ్మ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సినీ పరిశ్రమలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని హోస్ట్ అడగగా.. రాజమౌళి సమాధానం చెప్పకముందే.. "ఎన్టీఆర్.. ఎన్టీఆర్" అంటూ ఆడియన్స్ అరిచారు. అయితే రాజమౌళి మాత్రం.. ఎన్టీఆర్ తనకి ఫ్రెండ్ కాదని, తమ్ముడు లాంటి వాడని అన్నాడు. అలాగే 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు.
Also Read