Home

»

Latest News

బాల‌య్య‌ లాంటి ఆటంబాంబును క‌రెక్టుగా ఎలా ప్ర‌యోగించాలో బోయ‌పాటికి తెలుసు!

Nov 27, 2021 8:50PM

 

"బాల‌య్య‌బాబు ఒక ఆటంబాంబు. ఆ ఆటంబాంబును క‌రెక్టుగా ఎలా ప్ర‌యోగించాలో బోయ‌పాటి శ్రీ‌నుగారికి తెలుసు. మీరు ఆ సీక్రెట్ అంద‌రికీ చెప్పాలి. దాన్ని దాచేసుకుంటే కుద‌ర‌దు. స‌ర్‌.. బాల‌య్య‌గారూ.. మీ ఎన‌ర్జీ సీక్రెట్ ఏంటో మీరూ చెప్పాలి. ఆ డాన్సులేంటి సార్‌.. ఆ ఎన‌ర్జీ ఏంటి సార్‌!" అని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు టాప్ డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి. బాల‌కృష్ణ టైటిల్ రోల్ పోషించగా, బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన 'అఖండ' ప్రి రిలీజ్ ఈవెంట్ శ‌నివారం రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది. 

స్పెష‌ల్ గెస్ట్‌గా ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌మౌళి, "బోయ‌పాటి శ్రీ‌ను గారూ ఈ ఆడిటోరియంకే కాకుండా మొత్తం సినిమా ఇండ‌స్ట్రీకే ఒక ఊపు తెచ్చినందుకు థాంక్యూ. డిసెంబ‌ర్ 2 నుంచి మొద‌లుపెట్టి కంటిన్యూగా మ‌ళ్లీ అన్ని థియేట‌ర్లూ (ఆడిటోరియంను చూపిస్తూ) ఇంత ఫుల్‌గా, ఇంత అరుపులు కేక‌ల‌తో ఇక్క‌డ కూర్చున్న మాకెంత ఆనందం వ‌చ్చిందో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఎక్క‌డ తెలుగువాళ్లున్నారో వాళ్లంద‌రికీ అంత ఆనందం రావాల‌ని, వ‌స్తుంద‌ని క‌చ్చితంగా చెప్తున్నా." అని అన్నారు.

'అఖండ' పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను ఆడిటోరియంలో చూసిన ఆయ‌న‌, "ఇప్పుడు మ‌నం చూసింది నా దృష్టిల్లో జ‌స్ట్.. మ‌చ్చుతున‌కే. మొత్తం సినిమాలో ఇలాంటివి బోలెడ‌న్ని ఉంటాయ్‌. అఖండ కేర‌క్ట‌ర్ ఎంట్రీ కోసం సినిమా థియేట‌ర్‌లో మీలాగే నేనూ ఎదురుచూస్తున్నా. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో థియేట‌ర్‌లో! ఇంకెక్క‌డా చూసేది లేదు. 'అఖండ' చాలా చాలా పెద్ద హిట్ట‌వ్వాలి. మ‌ళ్లీ మా ఇండ‌స్ట్రీకి ఒక కొత్త ఊపును తీసుకురావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని చెప్పారు.

Also read:  "మీర‌స‌లు మ‌నిషేనా?" బాల‌య్య‌కు ప్ర‌గ్యా సూటి ప్ర‌శ్న‌!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com