'ఆర్ఆర్ఆర్'లో ఆలియా, అజయ్ దేవ్‌గణ్ కనిపించేది ఎంతసేపో చెప్పిన జక్కన్న!
on Dec 30, 2021

2022లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అతి పెద్ద చిత్రాలలో ఒకటైన 'ఆర్ఆర్ఆర్' అన్నింటికంటే ముందుగా జనవరి 7న విడుదలవుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎపిక్ రేంజ్‌లో యస్.యస్. రాజమౌళి రూపొందించిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని నటించారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించిన తారక్, చరణ్ స్క్రీన్‌పై అందరికంటే ఎక్కువసేపు కనిపిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ పాత్రలు ఎంతసేపు కనిపిస్తాయి? ఆ పాత్రల ప్రాధాన్యం ఏమిటనేది చాలామందికి పెద్దగా తెలియదు.
Also read: తెలుగునాట రూ. 60 కోట్ల షేర్ మార్కును చేరుకున్న 'అఖండ'!
ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ సినిమాలో అతిథి పాత్రల్లాంటివి చేశారనీ, అయితే వారు చేసిన పాత్రలు కథను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని రాజమౌళి వెల్లడించాడు. "ఒక పాత్ర అనేది దాని లెంగ్త్‌పై ఆధారపడి ఉండదు. ఆలియా, అజయ్ దేవ్‌గణ్ పాత్రలు చాలా ముఖ్యమైనవి. 'ఆర్ఆర్ఆర్'ను ఒక దేహం అనుకుంటే, అజయ్ చేసిన పాత్ర దానికి ఆత్మ లాంటిది. సినిమాలో రెండు శక్తులు, పవర్‌హౌస్‌లు ఉంటాయని మనకు తెలుసు. ఆ రెండు శక్తుల్నీ బ్యాలెన్స్ చేసే ఒక వ్యక్తి, ఆ రెండు శక్తుల్నీ అనుసంధానం చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి.. సీత. ఆ పాత్రను ఆలియా చేసింది. ఆ ఇద్దరూ అతిథి పాత్రలు చేశారు. ఈ విషయంలో నేను ఆడియెన్స్‌ను చీట్ చేయను. ప్రాముఖ్యం పరంగా, ఆ ఇద్దరివీ హీరోలతో సమానమైనవి, కొన్నేసిసార్లు హీరోల కంటే మరింత ముఖ్యమైనవీ." అని ఆయన చెప్పాడు.
Also read: ఆంధ్రప్రదేశ్‌లో 'ఆర్ఆర్ఆర్'కు మినహాయింపులు లేవు.. బెంబేలెత్తుతున్న బయ్యర్లు!
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తాము చేసిన పాత్రల్లో ఇమిడిపోయారని రాజమౌళి తెలిపాడు. "రామరాజు పాత్రకు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనా కూడా ప్రశాంతంగా కనిపించే నటుడు కావాలనుకున్నాను. అందుకే ఆ పాత్రకు చరణ్‌ను ఎంచుకున్నాను. అతను నా సినిమాలో కేవలం రామరాజు కాదు. భీమ్ విషయానికి వస్తే, అమాయకమైన హృదయం కలిగిన, తన భావాలనే ఏవీ దాచుకోలేని చాలా బలమైన నటుడు కావాలనుకున్నాను. అందుకే ఆ పాత్రలోకి తారక్ వచ్చాడు. ఇవే వ్యక్తులుగా వారికి ఉన్న ప్రాథమిక లక్షణాలు." అని చెప్పుకొచ్చాడు రాజమౌళి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



