Home

»

Latest News

Srinivasa Mangapuram Movie Review In Telugu: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ

Jul 30, 2026 1:15PM

 


-సినిమా పేరు: శ్రీనివాస మంగాపురం
-న‌టీన‌టులు: జై కృష్ణ, రషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, నరేష్, బ్రహ్మాజీ, అజయ్    తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: జయకృష్ణ గుమ్మడి 
-ఎడిటింగ్: మాధవ్ కుమార్ 
-మ్యూజిక్: జి వి ప్రకాష్ కుమార్ 
-నిర్మాత‌: అశ్వనీదత్, కిరణ్ 
-బ్యానర్స్: వైజయంతి మూవీస్, చందమామ కథలు పిక్చర్స్  
-రచన,దర్శకత్వం: అజయ్ భూపతి 
-రిలీజ్ డేట్ : జులై 30 ,2026 


ఘట్టమనేని మూడో తరం వారసుడు 'జై కృష్ణ'(Jai Krishna)ఈ రోజు నట ప్రపూర్ణ 'మోహన్ బాబు(Mohan Babu),మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని తో కలిసి 'శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
శ్రీను(జై కృష్ణ) యంగ్ అండ్ డైనమిక్ యువకుడు. ఎంతటి ప్రతికూల సంఘటనలనైనా ఫేస్ చేసే దైర్యం శ్రీను సొంతం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి తిరుపతి వస్తాడు. మంగ(రషా తడాని) తిరుపతిలో బాగా పేరు పలుకుబడి ఉన్న పెద్దిరెడ్డి( శ్యామ్) ఒక్కగానొక్క కూతురు. చాలా మంచి మనసు గల యువతితో పాటు తన వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదనే వ్యక్తిత్వం తన సొంతం. మంగని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని శ్రీను వెంటపడుతుంటాడు. కానీ మంగ మాత్రం శ్రీనుని స్నేహితుడిలా చూస్తుండటంతో పాటు వేరే వ్యక్తితో పెళ్ళికి రెడీ అవుతుంది. వెంకటప్పనాయుడు(మోహన్ బాబు) బళ్లారిలో పేరు మోసిన మహాశక్తీ. తనకి అడ్డొచ్చాడని సొంత తమ్ముడినే చంపిన రికార్డు వెంకటప్ప నాయుడు సొంతం. వెంకటప్పనాయుడుని అంతం చెయ్యాలని తమ్ముడి కొడుకు( అజయ్) చూస్తుంటాడు. పెద్దిరెడ్డికి వంశ పారంపర్యంగా వస్తున్న 'గన్' ని శ్రీనుకి మంగ ఇస్తుంది.స్నేహితుడిలా చూస్తున్న శ్రీనుకి మంగ గన్ ఎందుకు ఇచ్చింది? తిరుపతి వచ్చిన వెంటనే  మంగని ప్రేమిస్తున్నాని శ్రీను ఎందుకు వెంటపడుతున్నాడు? శ్రీనుది నిజమైన ప్రేమేనా? లేక ఏమైనా కారణం ఉందా? అసలు బళ్లారి నుంచి ఎందుకు వచ్చాడు? ఎవరి తాలూకా? అనేదే కథ

ఎనాలసిస్ 
ఇలాంటి కథతో కూడిన చిత్రాలు గతంలో కొన్నివచ్చాయి. కానీ కథనం బోర్ కొట్టకుండా సాగడంతో శ్రీనివాస మంగాపురం పర్వాలేదనే స్థాయిలోనే మెప్పిస్తుంది. ముఖ్యంగా జై కృష్ణ తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించకపోయి ఉంటె సినిమా ఫలితం వేరేలా ఉండేది. డెబ్యూ హీరోకి ఇలాంటి సబ్జెక్ట్ లో పెర్ఫార్మ్ చేయ్యడమంటే కత్తి మీద సాము అని చెప్పవచ్చు. అలాంటిది జై కృష్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో శ్రీనివాస మంగాపురం కి రక్షణ కవచంలా నిలిచాడు. ఫస్ట్ హాఫ్  చూసుకుంటే స్టార్టింగ్ లోనే వచ్చిన శ్రీను(జై కృష్ణ) ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. ఆ తర్వాత ఏ మాత్రం లేటు చేయకుండా కథలోకి వెళ్లడంతో పాటు మంగ, శ్రీను మధ్య వచ్చిన సీన్స్ చాలా ఫన్నీగా బాగున్నాయి.

స్వతంత్ర బాబు(నరేష్ ) బాలు( బ్రహ్మాజీ) మధ్య నడిచిన కామెడీ ట్రాక్ బాగానే  పేలింది. ఈ ఇద్దరి రోల్స్ ని శ్రీను లవ్ కి హెల్ప్ గా  వాడుకొని ఎంటర్ టైన్ మెంట్ ని సృషించాల్సింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. పెద్ది రెడ్డి సీన్స్ కూడా బాగానే ఉన్నా శ్రీనుకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందనే క్యూరియాసిటీని కలిగించడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో ఊహించని కథ రన్ అవుతుంది. మంగ ఎపిసోడ్ హైలెట్. ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి . వెంకటప్ప నాయుడు(మోహన్ బాబు) క్యారక్టర్ డిజైన్ బాగుంది. కానీ ఆ క్యారక్టర్ చేసే పోరాటాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ లో మెప్పించిన విధంగా సాంగ్స్ ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్ బాగున్నా క్లైమాక్స్ లో హడా విడి సృష్టించి ఎండ్ చేయాల్సింది. అలా కాకుండా సింపుల్ గా తేల్చి పడేసారు.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 
జై కృష్ణ మొదటి సినిమా అయినా తన పెర్ఫార్మ్ తో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు. లవ్, యాక్షన్, ఫైట్స్ సన్నివేశాల్లో ఎంతో అనుభవమున్న నటనని ప్రదర్శించాడు. తెలుగు పరిశ్రమకి ఇంకో మంచి నటుడు దొరికినట్లే. ముఖ్యంగా సిగరెట్ కాల్చే స్టైల్, రివాల్వర్ వాడే విధానంలో ఘట్టమనేని తర్వాతే ఎవరైనా అనే టాగ్ లైన్ ని మరోసారి గుర్తు చేసాడు.రష తడాని కూడా ఎంతో బరువున్న మంగ క్యారక్టర్ లో అవలీలగా నటించి మెప్పించింది. వెంకటప్ప నాయుడుగా  మోహన్ బాబు ఎప్పటిలాగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోహన్ బాబు వి ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండేది అనిపించేలా సాగింది. నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నరేష్ గారి సీన్స్ కూడా ఇంకొన్ని ఉంటే బాగుండని అనిపిస్తుంది. పెద్దిరెడ్డి గా శ్యామ్ నటనలో మెరుపులు లేకపోయినా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. బ్రహ్మాజీ, అజయ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా పరిణితి చెందిన నటనతో మెప్పించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో మెరుపులు లేకపోయినా రచన పరంగా మెప్పించడంతో పాటు డైలాగ్స్ ఆణిముత్యాల్లా ఉన్నాయి. మూవీని కాపాడింది కూడా డైలాగ్స్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవి ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన సాంగ్స్ లో రెండు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఫొటోగ్రఫీ హైలెట్. ఇలాంటి సినిమాలకి నిర్మాణ విలువలు కనపడవు. 

బలాలు
1 జై కృష్ణ, రష తడాని పెర్ ఫార్మెన్స్ 
2 . కథనం
3 . ఫొటోగ్రఫీ 
4 . సెకండ్ హాఫ్ 
5 .మోహన్ బాబు పెర్ ఫార్మెన్స్  
6 . తిరుపతి అందాలు

బలహీనతలు 
1 . ఎంచుకున్న కథలో కొన్ని సినిమాల పోలికలు గుర్తుకు రావడం 
2 . డైరెక్షన్ లో మెరుపులు లేకపోవడం 

ఫైనల్ గా చెప్పాలంటే కథలో కొన్ని సినిమాల పోలికలు ఉన్నా జై కృష్ణ, రష తడాని, మోహన్ బాబు తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో 'శ్రీనివాస మంగాపురం' నచ్చేలా చేసారు.  

 రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                       అరుణాచలం 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com