రెజీనా ఎవర్ని పెళ్లి చేసుకొంటోందో తెలుసా??
on Sep 6, 2016
ఏంటీ రెజీనా మనసు కూడా పెళ్లివైపుకు మళ్లిందా, తాను కూడా పెళ్లి చేసుకొంటుందా? ఇలాంటి ప్రశ్నలేం వేయొద్దు. మేం చెబుతున్నది రియల్ లైఫ్ గురించి కాదు. రీల్ లైఫ్ గురించి. రెజీనా కథానాయికగా నటించిన చిత్రం జ్యో అచ్చుతానంద. ఇందులో నారా రోహిత్, నాగశౌర్య హీరోలు. రెజీనా కథానాయిక. ప్రచార చిత్రం చూస్తుంటే ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. జ్యో అనే అమ్మాయి కోసం అచ్యుత్, ఆనంద్ అనే ఇద్దరు అన్నాదమ్ములు పడే పాట్లు ఈ సినిమా.
మరి ఈ ఇద్దరిలో జ్యోని ఎవరు పెళ్లి చేసుకొంటారు?? నారా రోహితా, నాగ శౌర్యనా?? ఈ చిక్కుముడి వీడిపోయినట్టే. జ్యో పెళ్లి చేసుకొనేది వీరిద్దరినీ కాదు. మరో హీరోని. అవును. ఈ సినిమాలో మరో హీరో ఉన్నాడు. తనెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని. జ్యో అచ్చుతానందలో నాని ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. పతాక సన్నివేశాల్లో నాని దర్శన మిస్తాడట. రెజీనా పెళ్లి చేసుకొనేదీ నానీనేనని టాక్. ఈ విషయమై చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్ స్పందించాడు కూడా. నాని ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. అది ఎలాంటి పాత్ర అని చెప్పను. రెజీనా ఎవరిని పెళ్లి చేసుకొంటుందో తెరపైనే చూడాలి.. అంటున్నాడు. ఈ సస్పెన్స్కి తెర పడాలంటే.. ఈ సినిమా రావాల్సిందే. మనం చూడాల్సిందే.