Home

»

Latest News

సితారలో శ్రీ లీల బ్యాక్ టు బ్యాక్ మూవీస్!

Jan 24, 2022 10:48AM

`పెళ్ళి సంద‌D`చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది శ్రీ లీల‌. త‌న న‌ట‌న‌తో, న‌ర్త‌నంతో కుర్ర‌కారుని ఫిదా చేసింది. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `ధ‌మాకా` చిత్రంలో న‌టిస్తోంది శ్రీ లీల. అంతేకాదు.. `రౌడీ బాయ్స్` ఫేమ్ ఆశిష్ న‌టిస్తున్న రెండో సినిమా `సెల్ఫిష్`లోనూ ఈ ముద్దుగుమ్మ సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

Also read: జ‌గ‌న్ సాయం నా కుటుంబానికి అద్భుత‌శ‌క్తిని ఇచ్చింది!

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్ లో శ్రీ లీల బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్  చేయ‌బోతోంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. గ‌త ఏడాది `ఉప్పెన‌`తో సెన్సేష‌న‌ల్ డెబ్యూ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్ తో, నిరుడు `జాతిర‌త్నాలు`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న న‌వీన్ పోలిశెట్టితో సితార సంస్థ రెండు వేర్వేరు ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ నాయిక‌గా శ్రీ లీల‌ని ఎంపిక చేశార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్న‌ది.

Also read: చ‌లికాలంలో వేడిపుట్టిస్తున్న పూజ!

 కాగా, `అన‌గ‌న‌గా ఒక రాజు` పేరుతో రూపొంద‌నున్న న‌వీన్ పోలిశెట్టి సినిమాని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నుండ‌గా.. వైష్ణ‌వ్ తేజ్ మూవీని కూడా ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ టేక‌ప్ చేయ‌బోతున్నాడ‌ట‌. మ‌రి.. 2022లోనే రాబోతున్న ఈ నాలుగు సినిమాల‌తో శ్రీ లీల.. స్టార్ హీరోయిన్స్ లీగ్ లో చేరుతుందేమో చూడాలి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com