నాన్నే కాదు..కూతురు కూడా వదలదా..?
on Sep 15, 2017

సూపర్‌స్టార్ మహేశ్ బాబు..గ్రీకు వీరుడిగా తళతళమెరుసిపోతూ..అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగిపోతున్నాడు ప్రిన్స్. మాములు అమ్మాయిల నుంచి టాప్ హీరోయిన్లు సైతం మహేశ్ అంటే పడిచచ్చిపోతారు. ఇప్పుడు మహేశ్‌కే కాదు ఆయన ముద్దుల కూతురు సితారకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. బయట వేదికల మీద రెండు చిన్న చిన్న పిలకలు వేసుకుని క్యూట్‌గా ఉండే సితార అంటే మహేశ్ అభిమానులతో పాటు హీరోయిన్లకు కూడా చాలా ఇష్టం.

అప్పట్లో బ్రహ్మోత్సవం సందర్భంగా హీరోయిన్ సమంత సితార అల్లరికి ఫిదా అయిపోయింది. షూటింగ్ టైంలో ఈ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరింది. ఖాళీ దొరికితే సితారతో ఆడుకోవడం..ఆమెకు బొమ్మలు ఇవ్వడమే హాబీగా చేసుకుంది. ఇప్పుడు రకుల్ వంతు వచ్చింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ స్పైడర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఫ్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎప్పటిలాగే సూపర్‌స్టార్ తన భార్యాపిల్లలతో పాటు వచ్చాడు..ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ తన పక్కన కూర్చొన్న సితారను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ స్టిల్ ఇప్పుడు అభిమానులకు కనువిందు చేస్తోంది.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



