Home

»

Latest News

Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ కోరుకునేది ఇదే డార్లింగ్ 

May 14, 2026 4:42PM

 

 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ లో స్పిరిట్(Spirit)ఒకటి. ప్రెజెంట్ హైదరాబాద్ లో వేసిన భారీ పోలీస్ స్టేషన్ సెట్ లో కథకి సంబంధించిన కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా స్పిరిట్ కి సంబంధించి ప్రభాస్(Prabhas)ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ఏకంగా 60 రోజుల నాన్-స్టాప్ షెడ్యూల్ కేటాయించినట్లు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత ప్రభాస్ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించిన మూవీ స్పిరిట్ అని చెప్పవచ్చు. ఈ లాంగ్ షెడ్యూల్‌లో  కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు, హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసే సీన్లని  చిత్రీకరించనున్నారు.   


సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)స్టైల్‌లోనే  చాలా రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందని, అందుకే ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ భారీ షెడ్యూల్‌ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. స్పిరిట్ దాదాపు 8 భాషల్లో విడుదల కానుంది. ఇందులో విలన్ పాత్ర కోసం కూడా ఒక భారీ బాలీవుడ్ స్టార్‌ను లేదా ఇంటర్నేషనల్ యాక్టర్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజర్ లేదా గ్లింప్స్ వచ్చే ముహూర్తం  కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.


Also read: leela mahal: ఏకైక సింగిల్ స్క్రీన్ లీలా మహల్ రీ ఎంట్రీ.. 75 ఏళ్ళ చరిత్ర తన సొంతం 

ప్రభాస్ అంకితభావం, సందీప్ రెడ్డి వంగా విజన్ తోడైతే 'స్పిరిట్' ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త ప్రభంజనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. 60 రోజుల ఈ మెగా షెడ్యూల్ పూర్తయితే సినిమా మేజర్ పార్ట్ కంప్లీట్ అయినట్లే అని తెలుస్తోంది. మార్చి 5 2027 న రిలీజ్ కానున్న స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండగా త్రిప్తి డిమ్రి హీరోయిన్.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com