Home

»

Latest News

కలెక్షన్స్ లో తోపు ఎవరు: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే vs ది ఒడిస్సీ 

Aug 8, 2026 12:57PM

 


స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే vs ది ఒడిస్సీ.. ఇప్పుడు ఈ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్టుగా యుద్ధం సమయంలో అమెరికా, ఇరాన్  దేశాల హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవ్వలేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి ఆ రెండు చిత్రాల ప్రభంజనం యొక్క 'ఓరా' ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. జూలై 17, న ‘ది ఒడిస్సీ’ జూలై 31 న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వచ్చేసి జులై నెలని ప్రపంచ సినీ ప్రేమికుల అత్యంత హ్యాపీయస్ట్ మంత్ గా మార్చేశాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాల మధ్య కలెక్షన్స్ పరంగా జరుగుతున్న   బిలియన్ డాలర్ పోరు అంతర్జాతీయ ఫిల్మ్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. 


 స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ రేసులో అసాధారణమైన వేగాన్ని ప్రదర్శిస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే ఉత్తర అమెరికాలో ఏకంగా 500 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు . 4,700 కోట్లకు పైమాటే. గతంలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’ సినిమాలు ఎనిమిది రోజుల్లో సాధించిన ఈ భారీ రికార్డును ‘స్పైడర్ మ్యాన్’ కేవలం ఏడు రోజుల్లోనే అధిగమించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాసింది.  అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్పైడర్ మ్యాన్ విజువల్ దాడి కొనసాగుతోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 808 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్ 1.31 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో లెక్కకడితే ఇది దాదాపు . 12,300 కోట్లకు సమానం. రెండో వారంలో కూడా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో, రాబోయే రోజుల్లో మొత్తం వసూళ్లు 1.66 బిలియన్ డాలర్లకు, అంటే దాదాపు  15,600 కోట్లకు చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  భారతీయ సినీ మార్కెట్‌లో కూడా మొదటి వారంలోనే  44 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది, అంటే భారతీయ కరెన్సీలో సుమారు  420 కోట్లకు పైగా రాబట్టింది. ఈ గ్రాండ్ వసూళ్లతో భారత్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ సినిమాల జాబితాలో ‘స్పైడర్ మ్యాన్’ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే ఊపు కొనసాగితే ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’ను అధిగమించడమే కాకుండా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రికార్డులపై కూడా కన్నేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 


Also read: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు: కలెక్షన్స్ పోస్టర్ల వెనుక అసలు నిజం ఇదే 


 మరోవైపు, లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, మాట్ డామన్ ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ తనదైన రీతిలో ఊచకోత కోస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1.008 బిలియన్ డాలర్లు రాబట్టింది. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 9,500 కోట్లకు పైమాటే. ఇందులో ఉత్తర అమెరికా నుంచి 429.65 మిలియన్ డాలర్లు (రూ. 4,000 కోట్లు) కలెక్ట్ కాగా, విదేశీ మార్కెట్ల నుంచి 578.8 మిలియన్ డాలర్లు (రూ. 5,400 కోట్లు) వసూలయ్యాయి. డార్క్ నైట్, ఓపెన్ హైమర్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ కెరీర్‌లో 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా ‘ది ఒడిస్సీ’ నిలిచింది.  ‘ది ఒడిస్సీ’ విజయ ప్రస్థానంలో ప్రఖ్యాత IMAX ఫార్మాట్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు ఒక్క ఐమాక్స్ థియేటర్ల నుంచే ఈ చిత్రం 257 మిలియన్ డాలర్లకు పైగా, అంటే దాదాపు 2,400 కోట్ల వసూళ్లను సాధించింది. త్వరలోనే ఐమాక్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు ఇది సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో సినిమా మార్కెట్ అయిన చైనాలో ఈ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది. అక్కడ సాధరణ స్క్రీన్లతో పాటు 800 IMAX స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ పోరులో స్పైడర్ మ్యాన్ మొదటి వారంలోనే  12,300 కోట్లతో చిరుత వేగాన్ని చూపిస్తే, ది ఒడిస్సీ మూడు వారాల్లో  9,500 కోట్లు రాబట్టి బిలియన్ డాలర్ క్లబ్‌లో చేరి తన హవా కొనసాగిస్తోంది

Spider man Brand New Day, The Odyssey, Christopher Nolan, Tom Holland, Hollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com