ఆ కేసులో సన్నీలియోన్‌ని అరెస్ట్ చేస్తారా..?
on Feb 8, 2017

ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ కేవలం లింక్స్ క్లిక్ చేస్తే చాలు సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ ప్రజల నుంచి 3,700 కోట్లు వసూలు చేసిన సోషల్ ట్రేడ్ కుంభకోణం దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే సోషల్ ట్రేడ్.బిజ్ వ్యవస్థాపకుడు అనుభవ్ మిట్టల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరుము ఉరుమి మంగళం పడ్డట్టు ఇప్పుడు ఈ కేసు బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ మెడకు చుట్టుకుంది. గతేడాది మార్చి 29న అనుభవ్ మిట్టల్ ఇన్‌మార్ట్.కామ్ అనే పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సన్నీలియోన్ చాలా హుషారుగా పాల్గొన్నది...దాంతో పాటు అనుభవ్ పుట్టినరోజు పార్టీలో అతనితో పాటు చిందులు వేసింది. వీరిద్దరి ఫోటోలు బయటకు రావడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఏ క్షణంలోనైనా సన్నీని అరెస్ట్ చేస్తారంటూ పుకార్లు వస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



