తెలుగమ్మాయి బాలీవుడ్ ఎంట్రీ అదిరింది!
on Jun 27, 2016
మన తెలుగమ్మాయి.. అది కూడా తణుకు మండలానికి చెందిన శోబిత ధూళిపాళ ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకొంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన "రామణ్ రాఘవ్ 2.0"లో పోలీస్ ఆఫీసర్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రశంసార్హమైన నటన ప్రదర్శించింది. 2013లో మిస్ ఎర్త్ గా ఎంపికైన ఈ అమ్మడికి అప్పట్లో ప్రభాస్ సరసన ఆఫర్ వచ్చినప్పటికీ.. పారితోషికం విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆ ప్రొజెక్ట్ ను వదులుకొందని చెప్పుకొంటుంటారు.
ఇన్నాళ్లకు ఈ విధంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకొన్న శోబితను ప్రస్తుతం బాలీవుడ్ ను మాత్రమే కాక టాలీవుడ్ ఆఫర్లు కూడా వరిస్తున్నాయి. మరి ఈ అమ్మడు మొదటి ప్రేఫరెన్స్ టాలీవుడ్ కి ఇస్తుందో లేక బాలీవుడ్ కి ఇస్తుందో చూడాలి. ఇకపోతే.. అమ్మడు ఎక్స్ పోజింగ్ కు ప్రత్యేకించి పరిధులు ఏవీ పెట్టకపోవడంతో.. తెలుగులోకంటే బాలీవుడ్ లోనే కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



