చైతు పర్మిషన్ తో నా పిల్లలకి వాళ్ళు ఎవెంజర్స్ అని చెప్తాను
on Oct 1, 2024
ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలవడమే కాకుండా గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో చేసి వాల్యుబుల్ నటిగాను మారింది.రీసెంట్ గా హిందీలో లవ్ సితార అనే వెబ్ సిరీస్ చెయ్యగా సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ఉంది.
ఇక పొన్నియన్ సెల్వన్(ponniyin selvan)పార్ట్ 1 వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శోబితా ఆ సినిమా రోజులని గుర్తు చేసుకున్నారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయంరవి, త్రిష , ఐశ్వర్య లేక్ష్మీ తో కలిసి తను దిగిన ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి వీళ్ళందరూ ఎవెంజర్స్ అని నా పిల్లలకి చెబుతాను అనే క్యాప్షన్ ని ఉంచింది.ఇప్పుడు ఈ పిక్ అండ్ క్యాప్షన్ నెటిజన్స్ ని విశేషంగా ఆకర్షిస్తుంది. అదే విధంగా టీం కి కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు.మొన్న అబుదాబి లో జరిగిన ప్రతిష్టాత్మక ఐఫా అవార్డ్స్ లో కూడా పొన్నియన్ సెల్వన్ పలు అవార్డుల్ని గెలుచుకుంది.
శోభితాకి కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)తో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు త్వరలోనే వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. చైతన్య ప్రస్తుతం తండేల్(thandel)మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Also Read