ఈ సారి సంక్రాంతి పందెం డైనోసార్ పై వెయ్యండి.. ఓజి గుర్తుందిగా
on Jan 7, 2026

-ఎస్ కె ఎన్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటి
-ఎవరి పేర్లు చెప్తాడు
-రాజా సాబ్ ఈవెంట్ లో అసలేం జరిగింది
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)రేపు బెనిఫిట్ షోస్ తో వరల్డ్ వైడ్ గా 'ది రాజాసాబ్'(The Rajasaab)తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్ సుమారు 300 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మించిన రాజా సాబ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు రాత్రి హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో ప్రీ రిలీజ్ పార్టీ ని నిర్వహించింది. ఈ వేడుకకి అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది.
Also read: మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్.. ఏ ఫంక్షన్ దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు
ఈ సందర్భంగా రాజాసాబ్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఎస్ కె ఎన్(Skn)మాట్లాడుతు విశ్వప్రసాద్ గారు తన 'మిరాయ్'(Mirai)మూవీ మంచి రన్నింగ్ లో ఉన్నప్పడే ఓజి కోసం కొన్ని థియేటర్స్ ని త్యాగం చేసారు. తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎదగడానికి ప్రభాస్ గారు బాహుబలి ద్వారా ఐదేళ్లు కష్టపడ్డారు. అలాంటి ప్రభాస్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ పెద్దలు థియేటర్స్ విషయంలో కో ఆపరేట్ చెయ్యాలి. అలా కో ఆపరేట్ చేసిన వాళ్ళ పేర్లు పండుగ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఆ ప్రెస్ మీట్ లో అందరి పేర్లు ఉండాలని అనుకుంటున్నాను.ఎందుకంటే నాకు ఒక్క థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటాను. థియేటర్ ఇవ్వకపోతే రెండు వందల సార్లు చెప్తాను. అది నా నైజం. ఈ పండక్కి వస్తున్న చిరంజీవి, వెంకటేష్ గారి మన శంకర వర ప్రసాద్ గారు తో పాటు మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలి. ప్రతి సంక్రాంతికి కోళ్లపై పందెం వేస్తారు . ఈ సారి పందెం డైనోసార్ పై వెయ్యండి అని చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ మాటలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



