మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ.. ఏం జరగబోతుంది
on Dec 27, 2025

-ఏం జరగబోతుంది
-శివాజీ ఏం చెప్తాడు
-కమిషన్ ఏమంటుంది
శివాజీ(Sivaji)ఇటీవల మహిళల వస్త్రధారణపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది నటీమణులతో పాటు మహిళా సంఘాలు శివాజీ వ్యాఖ్యలపై భగ్గుమనడంతో పాటు శివాజీ పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసారు. దీంతో విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ సదరు అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని నిర్ణయించి 27 వ తేదీన శివాజీ వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఈ రోజు శివాజీ సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్ళాడు.ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విచారణ అనంతరం శివాజీ మాట్లాడుతు నేను అనవసరంగా సలహాలు ఇచ్చి పొరపాటు చేశాను. . రాజ్యాంగం అందరికి సమాన హక్కు ఇచ్చింది. ఈ డిస్కర్షన్ ని ఇంతటితో ముగిద్దాం. నేను మహిళా కమిషన్ అడిగిన వాటికి సమాధానం ఇచ్చాను. మళ్ళీ ఫోన్ చేస్తామని అన్నారు.నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే చెప్పమని కూడా చెప్పాను. ఎవరి అంతరాత్మలకి వాళ్ళకి తెలుసు. ఏం జరుగుతుందో. నా మీద కుట్ర చేసే అవసరం ఎవరకి లేదు. నేను ఎవరికి భయపడను. ఆత్మాభిమానం ఉన్న వాడిని. నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది వినలేదు. అందరికి నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు అని చెప్పుకొచ్చాడు.
also read: హీరోయిన్ల వస్త్రదారణపై నాగబాబు చెప్తున్నది ఇదే.. నేరం ఎవరిది
ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాట్లాడుతు మహిళలపై అసభ్యంగా లేదా అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు. శివాజీ వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకున్న అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పషం చేసిన నేపథ్యంలో శివాజీ పై మహిళా కమిషన్ రియాక్షన్ పై ఆసక్తి నెలకొని ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



