ఎన్టీఆర్ సినిమాపై సితార నాగవంశీ బిగ్గెస్ట్ అప్ డేట్.. సోషల్ మీడియా క్రాష్
on Jul 5, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత 'నాగవంశీ'(Naga Vamsi)మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో త్రివిక్రమ్(Trivikram)దర్శకత్వంలో వచ్చిన అరవింద సమెత వీరరాఘవ' సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఎన్టీఆర్ నటనలో దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఎన్టీఆర్ ప్రీవియస్ మూవీ 'దేవర' ని నాగవంశీనే రెండు తెలుగు రాష్టాల్లో డిస్ట్రిబ్యూట్ చేసి దేవర విజయంలో కూడా భాగస్వామ్యమయ్యాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ వార్ 2 (War 2)ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ(Naga Vamsi)నే రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్నీ అధికారకంగా ఒక వీడియో ద్వారా వంశీ తెలియచేసాడు. సదరు వీడియోలో మూడు ఖరీదైన కార్లు, వ్యాన్ లు రోడ్ పై వేగంగా వస్తుంటే 'గెట్ రెడీ, నౌ ఇట్స్ టైం, ఫర్ ది హ్యాట్రిక్, జాయినింగ్ ఫోర్సెస్ అగైన్ విత్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే క్యాప్షన్స్ తో అరవింద సమెత వీరరాఘవ ,దేవర, వార్ 2 స్టిల్స్ వచ్చాయి, ఇప్పుడు ఈ వీడియో రిలీజైన కాసేపటికే సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది
వార్ 2 ఆగస్టు 14 న పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. హృతిక్ రోషన్(Hrithik Roshan)కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రానా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు వార్ 2 కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
