ఎస్.ఐ.టి మూవీ రివ్యూ
on May 11, 2024
మూవీ : ఎస్.ఐ.టి
నటీనటులు: అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్, నటాషాదోషి, రుచితాసాధినేని, అనిల్ రాథోడ్ తదితరులు
ఎడిటింగ్: కిరణ్ తుంపెర
మ్యూజిక్: వరికుప్పల యాదగిరి
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
నిర్మాతలు: ఎస్. నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస రెడ్డి
దర్శకత్వం: విజయ భాస్కర్ రెడ్డి
ఓటీటీ : జీ5
కథ :
ఓ ఇంట్లో ఉన్న ఒకావిడని గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కాల్చి చంపేస్తాడు. కాసేపటికి ఆఫీసులో ఉన్న వ్యక్తికి.. మీ ఆవిడ చనిపోయిందంటూ కాల్ వస్తుంది. ఇక దీనితర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. అయితే ఆ అమ్మాయిని చంపిందెవరో కనిపెట్టడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎస్.ఐ.టీ) ని ఏర్పాటు చేస్తుంది డిపార్ట్మెంట్. ఇక తర్వాత రోజు నుండి ఆ ఇంటికి వచ్చే పాలవాడు, పేపర్ వాడు, పనిమనిషి అంటూ ఎవరని వదలకుండా అందరిని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడతారు పోలీసులు. ఇక అమ్మాయి తల్లిదండ్రులని విచారించగా.. ఆమె భర్త తనని అనుమానించేవాడని.. కొట్టేవాడని.. అతనే చంపేశాడేమోననే అనుమానంగా ఉందంటూ చెప్తారు. ఇక ఆమె భర్తని ఇన్వెస్టిగేషన్ చేయగా.. అవును నేనే చంపానంటు నిజం ఒప్పేసుకుంటాడు. ఇక డీజీపీ కి కేసు గురించి జరిగిందంతా చెప్పి కేసుని క్లోజ్ చేయాలని ఎస్.ఐ.టీ టీమ్ చెప్తారు. అయితే అప్పుడే వారికి ఫోరెన్సిక్ టీమ్ నుండి.. ఆమె బాడీ మీద అమ్మాయికి సంబంధించిన ఓ క్లూ లభిస్తుంది. మరోవైపు ఆమెని ఎవరో రేప్ చేసి.. ఊపిరాడకుండా చేసి చంపేశారని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంటుంది. అసలు ఆమెని చంపిందెవరు? ఆమె భర్తే అసలైన నేరస్తుడా? ఎస్.ఐ.టీ టీమ్ అసలు నేరస్థుడిని కనిపెట్టిందా లేదా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
అమ్మాయిని చంపేయడం.. నేరస్థుడెవరో కనిపెట్టడానికి ఎస్.ఐ.టి టీమ్ ఏర్పాటవుతుంది. దీంతో హత్య చేసిందెవరనే క్యూరియాసిటిని పెంచేశాడు దర్శకుడు. అయితే ఆ అమ్మాయి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే.. కథ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చి ఆగినట్టుగా అనిపిస్తుంది.
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలలో ఉండే ఇంటెన్స్ ని క్యారీ చేయడంలో ఎస్.ఐ.టి టీమ్ చాలా శ్రమించారు. గంట యాభై నిమిషాలే నిడివి ఉండటం ఈ సినిమాకి అదనపు బలంగా మారింది. ఒక హత్యను మూడు కోణాల్లో చూపించడం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. పోలీసులుగా అందరు బాగానే సెట్ అయ్యారు. కానీ యాక్టింగ్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. అయితే కథలో వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి.
ఒక అమ్మాయి చనిపోతే ఇన్ని జరుగుతాయా? ఇంత బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందా అనేంతలా ల్యాగ్ చేసి పడేసారు. భర్తే మొదట హంతకుడు అని చెప్పి ఆ తర్వాత భర్తకంటే ముందే ఎవరో చంపినట్టుగా అవే సీన్లు పదే పదే వస్తుంటాయి. అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్లు, ఫైట్ సీన్లు మినహాయిస్తే ఓవరాల్ గా కథనం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ పెద్దగా సెట్ అవ్వలేదు. క్లైమాక్స్ ముందు ఆ ఐటమ్ సాంగ్ అవసరం లేదనిపిస్తుంది. అడల్ట్ సీన్లు ఏమీ లేవు. అసభ్య పదజాలం ఎక్కడా వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా : క్రైమ్ థ్రిల్లర్ ని పంచే వన్ టైమ్ వాచెబుల్ మూవీ.
నటీనటుల పనితీరు:
ఎస్.ఐ.టి టీమ్ లోని పోలీసులుగా అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్, నటాషాదోషి, రుచితాసాధినేని , అనిల్ రాథోడ్ చక్కగా నటించారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
