త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేశా!
on Jul 7, 2024
ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి హోస్ట్ గా చేస్తున్నాడు శ్రీరామ చంద్ర. ఐతే శ్రీ రామ చంద్ర కొన్ని మూవీస్ లో నటించాడు కానీ తర్వాత ఆపేసాడు. రీసెంట్ గా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఎవరైనా మంచి అవకాశం ఇస్తే చేస్తానని , తనకు చేసే ఇంటరెస్ట్ ఉందని చెప్పాడు. ఆహాలో 'పాపం పసివాడు' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. తనకు ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోవడం వలన ఛాన్సెస్ గురించి తనకు తెలీడం లేదన్నారు. ఎవరైనా కొంతమంది వచ్చి స్టోరీ చెప్పి ప్రొడ్యూసర్స్ ఉంటే చేద్దాం అంటారు. కానీ తనకు అంతగా ఎవరూ తెలీదని చెప్పి పంపేస్తానన్నారు.
సన్నాఫ్ సత్యమూర్తి మూవీ జరిగేటప్పుడు తనకు త్రివిక్రమ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని ఆ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ఉంది అని చెప్పారు. కానీ అదే టైములో ఇంకో కాంట్రాక్టు చేస్తుండడంతో ఆ మూవీలో రోల్ చేసే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎవరి దగ్గరైన మూవీస్ ఉండి ఏదైనా రోల్ కి తానూ సూటవుతాను అనుకుంటే కలవమని కూడా చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి విషయం గురించి చెప్తూ.. "పెళ్లనేది మన చేతుల్లో లేదు. మ్యాచ్ సరిగ్గా సెట్ కాకపోతే మన చెయ్యి వదిలేసి వెళ్ళిపోతారు.. ఐతే నేను సింగర్ ని కాబట్టి వదిలి వెళ్ళిపోరు అనుకుంటారు కానీ వెళ్లిపోయే ప్రతీ సారి పాటలు పాడి పిలవలేం కదా" అన్నాడు శ్రీరామచంద్ర.