పెళ్ళి చేసుకున్న ప్రేమ జంట...!
on Jan 5, 2019

కమెడియన్ సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు ఎస్తర్. హీరోయిన్‌గా ఆమెకు రెండో చిత్రమది. సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘1000 అబద్దాలు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే... కథానాయికగా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. దాంతో ‘జయ జానకీ నాయక’తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అందులో నందుకి భార్యగా నటించింది. ఇప్పుడీమె ప్రస్తావన ఎందుకంటే... ఇటీవల ఈ హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెళ్ళి చేసుకుంది.

నటుడు, గాయకుడు నోయెల్ సేన్‌తో ఇటీవల ఆమె పెళ్ళి జరిగింది. ఇతను ‘నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్’లో ఓ హీరోగా నటించాడు. అంతకు ముందు ‘కుమారి 21ఎఫ్’లో కీలక పాత్ర చేశాడు. ఇంకా ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, ‘ప్రేమమ్’ తదితర చిత్రాల్లో నటించాడు. నోయెల్, ఎస్తర్ ఏడాదిగా ప్రేమలో ఉన్నారట! ఇద్దరూ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



