Home

»

Latest News

Toxic: మరోసారి టాక్సిక్ వైరల్.. కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్ 

Aug 1, 2026 5:44PM

 

టాక్సిక్(Toxic)కి సంబంధించి రొమాన్స్ సన్నివేశాలపై కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం రొమాన్స్ సన్నివేశాలపై  ట్రోల్స్  మొదలయ్యాయి.  మేకర్స్ మాత్రం కంటెంట్ కి తగ్గ లింక్ అనే మాటలు చెప్తున్నారు. ఏది ఏమైనా మాత్రం రొమాన్స్ మాటర్ అనేది టాక్సిక్ కి ట్యాగ్ లైన్ గా మారింది. రీసెంట్ గా టాక్సిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిన్న జూలై 31న కియారా అద్వానీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్, రొమాంటిక్ ఫొటో షేర్ చేశాడు. 'నా ప్రతి రోజును మరింత తీపిగా మార్చే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు.. నా ఐస్‌క్రీమ్‌ను దొంగిలించినప్పటికీ" అంటూ చాలా ముద్దుగా క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు లక్షలాది మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు లైక్‌లు కొడుతూ కియారాకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ హ్యాపీ మూమెంట్స్ మధ్య కొందరు నెటిజన్లు అనవసర వివాదానికి తెరలేపారు.  'టాక్సిక్' (Toxic)లో కియారా అద్వానీ 'నాదియా' అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని 'తబాహి' (Tabaahi) పాట విడుదలై యూట్యూబ్‌లో కాంబినేషన్ కుమ్మేసింది. ఆ సినిమాలో ఆమె నటన, కొన్ని సీన్స్, అలాగే బోల్డ్ లుక్‌ గురించి కొందరు నెటిజెన్స్ ద్వంద్వార్థాలతో కూడిన అనుచిత కామెంట్లు చేయడం ప్రారంభించారు.

Also read: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే 

ఈ దాడిపై కియారా అభిమానులు, సాధారణ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఒక నటిగా సినిమా పాత్ర డిమాండ్ మేరకు ప్రొఫెషనల్‌గా నటించడం వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడంపై ట్రోలర్లకు గట్టిగా బుద్ధి చెప్పారు. "సినిమాలోని   క్యారెక్టర్స్ కి ,పర్సనల్ లైఫ్‌కు ముడిపెట్టి ఇలా నీచంగా కామెంట్స్ చేయడం నెటిజన్ల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నటుడు లేదా నటి ప్రొఫెషన్‌లో ఎలాంటి పాత్రనైనా పోషించవచ్చు. దాన్ని వారి సొంత జీవితంతో ముడిపెట్టి దారుణంగా వ్యాఖ్యానించడం అత్యంత దారుణమని కామెంట్ సెక్షన్‌లో అభిమానులు ట్రోలర్లని  నిలదీస్తున్నారు. ఇక టాక్సిక్  ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 


Sidharth malhotra, Kiara Advani, Toxic, yash

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com