వరంగల్ లో 'శ్యామ్ సింగరాయ్' రాయల్ ఈవెంట్!
on Dec 10, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు సినిమా విడుదల తేదీకి ఇంకా రెండు వారాలే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది మూవీ టీమ్.
Also Read: 'లక్ష్య' మూవీ రివ్యూ
'శ్యామ్ సింగరాయ్' మూవీ టీమ్ త్వరలో వరంగల్ లో అగుడుపెట్టనుంది. వరంగల్ లోని రంగలీలా మైదాన్ లో డిసెంబర్ 14 న సాయంత్రం 5 గంటలకు 'రాయల్ ఈవెంట్'ను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరంగల్ తో పాటు తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలో ఇలాంటి వేడుకలను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నాని కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వీలైనంత సమయం కేటాయించాలని చూస్తున్నాడని తెలుస్తోంది. నాని గత చిత్రాలు వి, టక్ జగదీష్ ఓటీటీలో విడుదలై నిరాశపరిచాయి. ఇప్పుడు నాని 'శ్యామ్ సింగరాయ్'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.
Also Read: 'తెలుగు వన్' సినిమా.. ఏపీలో పెను సంచలనం అవుతుంది!

Also Read: సూపర్ స్టార్ కి గూస్ బంప్స్ తెప్పించిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్!
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



