
ప్రెజెంట్ థియేటర్స్ లో ఆకాశంలో ఒక తార పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఉంది. సాత్విక, దుల్కర్ తమ క్యారెక్టర్స్ లలో అద్భుతంగా చేసారని, ఆ ఇద్దరి కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోవడం ఖాయమని చెప్తున్నారు. అదే టైంలో రోహిణిగా చేసిన శృతి హాసన్ తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మ్ తో ఆకాశంలో ఒక తారకి మరో ప్రధాన బలంగా నిలిచిందని కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు.
దీంతో తన కెరీర్‌లోనే ఒక అత్యుత్తమమైన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందని సినీ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా, కథని మలుపు తిప్పే బలమైన రోల్ లో మెస్మరైజ్ చేసిన తీరు ప్రతి ఒక్కర్నికట్టిపడేస్తోంది. ‘రోహిణి’ అనే ఒక మోడ్రన్, ఫ్యాషన్ గర్ల్ రోల్ లో కనిపించింది. నేటి తరం యువత ఆలోచనలకు, వారి జీవనశైలికి అద్దం పట్టేలా రోహిణి క్యారెక్టర్‌ను దర్శకుడు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు.
తెరపై శ్రుతి హాసన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా ముగిసే వరకు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే ఒక ఆధునిక యువతిగా ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆమె హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం, స్వతంత్ర భావాలు యువతని, జెన్ జి బ్యాచ్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాడీలాంగ్వేజ్ సైతం చాలా సహజంగా పండించి లోకనాయకుడు కమల్ హాసన్ పుత్రికారత్నం అంటే ఇలాగే ఉంటుంది మరి అనిపించింది.
.webp)
రోహిణికి ఒక బలమైన ఎమోషనల్ కోణం కూడా ఉంది. కథలో కీలక మలుపులు తిరిగే సన్నివేశాల్లో శ్రుతి హాసన్ పలికించిన హావభావాలు థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తున్నాయి. ఎమోషనల్ సీన్లలో ఆమె కళ్ళతోనే పలికించిన భావాలు, డైలాగ్ డెలివరీలో చూపించిన పరిణతి ప్రధాన బలం.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!
ఒక వైపు అల్ట్రా మోడ్రన్ గర్ల్‌గా కనిపిస్తూనే, మరోవైపు ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆమె రోల్ సాగే తీరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.కథలోని ఇతర ప్రధాన క్యారెక్టర్స్ కి, కథనానికి ఆమె రోల్ ఇచ్చిన బలం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
.webp)
గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రుతి హాసన్‌కు, ఈ సినిమా మళ్ళీ టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మొత్తానికి నయా ఫ్యాషన్ గర్ల్ హోదాలో శృతి చాలా రోజుల తర్వాత తెలుగు సెల్యులాయిడ్ పై ఎంట్రీ ఇచ్చి తెలుగు ఎక్స్ క్లూజివ్ జెన్ జీ బ్యాచ్ కి రోల్ మోడల్ గా నిలిచింది. దైర్యం, ఆత్మ విశ్వాసం స్పెషల్ బోనస్.
మీకు నచ్చవచ్చు: వరుస హిట్లతో దుల్కర్ సల్మాన్ సరికొత్త చరిత్ర!
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి ధైర్యాన్ని ఇచ్చే మూవీ!
[Shruti Haasan, Aakasamlo Oka Tara,Dulqer Salmaan, Sathvika Veeravalli, Pawan Sadineni]





