ఎంగేజ్ మెంట్ జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్
on Jan 29, 2024

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి పెద్ద పండుగ. అలాంటి పెళ్లిని తమకి నచ్చిన వాళ్ళతో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక సెలెబ్రిటీస్ అయితే ధూమ్ ధామ్ గా జరుపుకుంటారు. ఇక అందులోను సినిమా వాళ్ళ పెళ్లి అయితే ఇక చెప్పక్కర్లేదు దేవతలు సైతం ముక్కున వేలేసుకునేంత వేడుకగా జరుపుకుంటారు.తాజాగా ఒక సినిమా హీరోయిన్ పెళ్లి అదే విధంగా జరిగింది. కాకపోతే ఈ పెళ్ళికి సంబంధించిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎంగేజ్ మెంట్ జరిగిన నాలుగేళ్లకు విహహం జరిగింది.
ప్రముఖ గుజరాతీ హీరోయిన్ శ్రద్దా దంగర్ (shraddha dangar) వివాహం ప్రముఖ నటుడు ఆకాష్ పాండ్యా(akash pandya)తో జరిగింది. 2020 లో వీరువురికి ఎంగేజ్ మెంట్ అయ్యింది. అప్పటి నుంచి రకరక కారణాలతో వాయిదా పడుతు వస్తున్న పెళ్లి తాజాగా జరిగింది.అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరి నిఖా జరిగింది. సోషల్ మీడియాలో శ్రద్దా వాటి తాలూకు పిక్స్ ని షేర్ చేసింది దీంతో చాలా మంది ఆ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే ఈ రోజుల్లో ఎంగేజ్ మెంట్ జరిగి ఒక నెల గ్యాప్ వస్తేనే అపార్ధాలు ఏర్పడి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. అలాంటింది నాలుగు సంవత్సరాల తర్వాత ఎలాంటి గొడవలు జరగకుండా పెళ్లి అవ్వడం గ్రేట్ అని అంటున్నారు.

గుజరాత్ లాంగ్వేజ్ లో శ్రద్దా మంచి పేరున్న హీరోయిన్. 2014 లో పప్పా తమ్నే నహి సంజె అనే చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత వచ్చిన హెల్లరో తో ఎంతో పేరు ప్రఖ్యాతులతో పాటు అవార్డు లని కూడా గెలుచుకుంది.తెలుగులో మాత్రం మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించింది. వరుడు ఆకాష్ కూడా నటుడుగా పలు సినిమాలతో పాటు కొన్ని టీవీ షోస్ కూడా చేసాడు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



