ఆర్యన్ ఖాన్ షారుఖ్ కొడుకు కాదట...!
on Apr 14, 2016
ఆర్యన్ ఖాన్ తెలుసా..షారుఖ్ గౌరీ దంపతుల తనయుడు ఆర్యన్. సాధారణంగా, ఎవరైనా గానీ షారుఖ్ కొద్దిగా తెలిసినా, నాకు షారుఖ్ పర్సనల్ తెలుసని గొప్పలు చెప్పేసుకుంటారు. కానీ స్వయంగా షారుఖ్ కొడుకైన ఆర్యన్ మాత్రం, తాను అసలు షారుఖ్ కొడుకునని చెప్పుకోవడానికే ఇష్టపడడట. స్వయంగా షారుఖే ఈ విషయాన్ని చెప్పడం విశేషం. తన ఫ్యాన్ మూవీ ప్రమోషన్లో ఉన్న షారుఖ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పాడు. ఆర్యన్ ను బయట ఎవరైనా మీరు షారుఖ్ కొడుకా అని అడిగితే, కాదు అని చెప్తాడట. తనను ప్రత్యేకంగా చూడటం ఆర్యన్ కు అసలు ఇష్టముండదట. స్టార్ కిడ్స్ కు ఎవరికైనా ఉండే సమస్యే ఇది. అందుకే ఆర్యన్ బాల్యం బాగా సాగడం కోసం, ఫారిన్ లో చదివించాను అంటున్నాడు షారుఖ్. అంతేకాదండోయ్. తన కొడుకు తన పేరును చెప్పుకపోవడం చూసి తనకు చాలా గర్వంగా ఉందంటూ పుత్రోత్సాహాన్ని బాగా ఆనందిస్తున్నాడు. షారుఖ్ గౌరీ కపుల్ కు ముగ్గురు పిల్లలు. ఆర్యన్ ఖాన్, సుహానా, అబ్ రామ్. వీరిలో అబ్ రామ్ సరోగేట్ పద్ధతి ద్వారా జన్మించడం విశేషం.