Home

»

Latest News

సర్దార్ 2 టీజర్.. మంచి విలన్ vs చెడ్డ హీరోలు.. ఎస్.జె.సూర్య విలనిజం నెక్స్ట్ లెవెల్.!

Aug 1, 2026 6:16PM

తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ 'సర్దార్' కు సీక్వెల్ గా వస్తున్న 'సర్దార్ 2' టీజర్ విడుదలై సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య అడిగే  పొడుపుకథతో 'సర్దార్ 2' టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. తండ్రీకొడుకులైన ఇద్దరు గూఢచారుల చుట్టూ ఈ స్పై థ్రిల్లర్ తిరుగుతుంది. అందులో తండ్రి పాత్ర నాటుగా కనిపించినప్పటికీ, అపారమైన శారీరక బలం, మేధాశక్తి ఉన్న జీనియస్ గూఢచారిగా కథలో కనిపించనున్నాడు. ఇక కొడుకు విషయానికి వస్తే, మోడర్న్ లుక్ లో కూల్ గా కనిపించినప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన మిషన్లను సైతం సునాయాసంగా పూర్తి చేయగల పవర్ ఫుల్ టఫ్ గై గా కనిపిస్తున్నారు. తండ్రీకొడుకులైన ఈ ఇద్దరు స్పైస్ చుట్టూ కథ నడుస్తున్నప్పటికీ, వారి అసలు టార్గెట్ తానేనంటూ విలన్ ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

టీజర్ లో ఎస్.జె.సూర్య చెప్పే డైలాగ్స్, డిఫరెంట్ మేనరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా సినిమాల్లో హీరోలు మంచివారు, విలన్లు చెడ్డవారుగా ఉంటారు. కానీ ఈ సినిమాలో సాంకేతికంగా నేనే మంచివాడిని, ఆ ఇద్దరు గూఢచారులే చెడ్డవారంటూ ఎస్.జె.సూర్య చెప్పే వినూత్న విలనిజం విశ్లేషణ కథపై తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరికి ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచేది మంచి విలనా లేక చెడ్డ హీరోలా అనేది ఈ చిత్రంలో అసలు ప్రశ్నగా నిలవనుంది.

కార్తీతో పాటు మాలవికా మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ను ఎస్.లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఉత్కంఠభరితమైన ఛేజింగ్ సీన్లతో నిండిన ఈ సర్దార్ 2 మూవీ సెప్టెంబర్ 10న విడుదల కానుంది.

 

 

Sardar 2 Teaser, Karthi, SJ Suryah

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com