ENGLISH | TELUGU  

ఆయ‌న‌కు 53.. ఆమెకు 25.. 'అత్రంగి రే'!

on Dec 4, 2020

 

'అత్రంగి రే' సినిమా సెట్స్ మీద‌కు అక్ష‌య్ కుమార్ అడుగుపెట్టారు. ఆయ‌న‌తో పాటు ఇందులో సారా అలీఖాన్‌, ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. అక్ష‌య్‌తో స్క్రీన్ పంచుకోవ‌డంపై ఉద్వేగానికి గురైన సారా, ఆ అనుభూతిని త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకుంది.

'అత్రంగి రే'లో తామిద్ద‌రిపై చిత్రీక‌రించిన ఓ పిక్చ‌ర్‌ను షేర్ చేసిన ఆమె, "AtrangiRe becomes more Rangeen! @akshaykumar so privileged, excited and thankful to be working with you!" అని రాసుకొచ్చింది.

సేమ్ పిక్చ‌ర్‌ను అక్ష‌య్‌కుమార్ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, 'అత్రంగి రే' షూటింగ్‌ను తాను మొద‌లుపెట్టిన విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. "The joy brought by those three magic words is unmatched : Lights, Camera, Action. Begun shooting for #AtrangiRe by @aanandlrai . Need all your love and best wishes. An @arrahman musical. Written by: #HimanshuSharma." అని ఆయ‌న ట్వీట్ చేశాడు.

క్రాస్‌-క‌ల్చ‌ర‌ల్ ల‌వ్ స్టోరీగా 'అత్రంగి రే' రూపొందుతోంది. 2018లో వ‌చ్చిన షారుఖ్ ఖాన్ సినిమా 'జీరో' త‌ర్వాత ఆనంద్ ఎల్‌. రాయ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఇందులో బిహారీ అమ్మాయిగా సారా న‌టిస్తుండ‌గా, ఆమె ప్రియునిగా ధ‌నుష్ క‌నిపించ‌నున్నాడు. అక్ష‌య్ రోల్ ఏమిట‌నేది ఆసక్తిక‌రం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.