Home

»

Latest News

sanya malhotra: ప్రియుడికి గుడ్ బై చెప్పిన హీరోయిన్.. ఆ ప్రియుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Apr 10, 2026 12:23PM

 


-దంగల్ తో ఇండియన్ సినీ లవర్స్ మనసులలో స్థానం 
-ఏడాదిగా లెజండ్రీతో ప్రేమలో 
-మరి హఠాత్తుగా ఇనిస్టాలో అన్ ఫాలో 

టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు అని పాడుతు ఏఎన్ఆర్ ఏమంటు చిందులేసాడో గాని ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో బ్రేక్ అప్ చెప్పుకునే ప్రేమికుల సంఖ్య ఎక్కువ అయ్యింది.ఈ మేరకు సోషల్ మీడియాని ఖాళీగా ఉంచకుండా ఎవరో ఒకరు ఆ బాధ్యతని తమ భుజ స్కందాలపై వేసుకుంటున్నారు. మరి ఆ కర్తవ్యాన్ని ఈ సారి దంగల్ ఫేమ్ 'సన్య మల్హోత్రా'(sanya Malhotra) తీసుకుందనేది టాక్. మరి బ్రేక్ లేకుండా పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

ఏడాది నుంచి సన్యా మల్హోత్రా, ప్రముఖ సితార్ వాయిద్యకారుడు రిషబ్ శర్మ(Rishab Sharma)తో ప్రేమాయణం నడుపుతుందనే న్యూస్ ఎప్పటికప్పుడు ముంబై సినీ వీధుల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆ ఇద్దరు ఎన్నో ఫంక్షన్స్ కి హాజరయ్యి జంటగా కనిపించే వాళ్ళు. అయితే తాజా బి టౌన్ సమాచారం ప్రకారం ఆ ఇద్దరు తమ రిలేషన్ కి మంగళం పాడారనేది టాక్. అందుకు బలాన్ని చేకూర్చేలా ఈ ఇద్దరు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసుకున్నారు. మరి కారణాలేంటో ఆ ఇద్దరికి తెలియాలి. రిషబ్ అయితే ఆల్రెడీ ఇంకో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడనే టాక్ కూడా చాలా బలంగానే చక్కర్లు కొడుతుంది. 

Also read: Dhurandhar 2: ధురంధర్ 2 మేకప్ ఆర్టిస్ట్ ప్రీతీ గురించి బయటకొచ్చిన నిజాలు

సాన్యా రీసెంట్ గా 'మిసెస్' చిత్రంతో వచ్చి మరో సారి సిల్వర్ స్క్రీన్ ని తన అద్భుతమైన నటనతో షేక్ చేసింది. ఈ నెల 15 న 'టోస్టర్' అనే వెబ్ సిరీస్ తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ రావు హీరో. సుందర్ పూనమ్', 'బందర్' వంటి చిత్రాలు కూడా సందడి చేయడానికి పందెం కోళ్ళల్లా బరిలో దిగడానికి కాచుకొని కూర్చున్నాయి. రిషబ్ కూడా తన వృత్తి పరంగా కచేరీలు చేసుకుంటు బిజీగా ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్(Pandit Ravishankar)శిష్యుడే రిషబ్ శర్మ.


 
 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com