ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు.. ఏ సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో..?
on Feb 5, 2024
సంక్రాంతి సమయంలో థియేటర్ల దగ్గర సందడి చేసిన సినిమాలన్నీ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి దూసుకొస్తున్నాయి. తెలుగు స్ట్రెయిట్ సినిమాలతోపాటు డబ్బింగ్ సినిమాలు సైతం మూవీ లవర్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితోపాటు కొన్ని చిన్న సినిమాలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం థియేటర్లలో కొటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తాము హక్కులు తీసుకున్న సినిమాలను స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ సంస్థలు కూడా రెడీ అవుతున్నాయి.
సంక్రాంతి సీజన్‌లో విడుదలైన వెంకటేష్, శైలేష్ కొలను కాంబో మూవీ ‘సైంధవ్’ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఇక జనవరిలోనే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘నా సామి రంగా’ ఫిబ్రవరి 15న హాట్ స్టార్, హులులో సందడి చేయనుంది. మరో డబ్బింగ్ మూవీ అయలాన్ థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీతో సరిపెట్టేసుకుంటోంది. ఫిబ్రవరి 16న సన్ నెక్ట్స్‌లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇక చిన్న సినిమాగా రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ మార్చి 22న డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి రాబోతోందని తెలుస్తోంది. జీ 5లో స్ట్రీమింగ్ కాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంటే ‘హనుమాన్’ మాత్రం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది.
Also Read