Home

»

Latest News

'అధీర' మళ్లీ యాక్షన్‌ లోకి వచ్చాడు!

Dec 7, 2021 3:51PM

కన్నడ సినిమా మార్కెట్ స్థాయిని పెంచిన సినిమా 'కేజీఎఫ్-1'. ఈ సినిమాతో హీరో యశ్ నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 'కేజీఎఫ్-1' ఎన్నో సంచలనాలు సృష్టించిన యశ్-నీల్ త్వరలో 'కేజీఎఫ్-2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ దాటిన 'అఖండ' ప్ర‌భంజ‌నం!

'కేజీఎఫ్-1' సృష్టించిన సంచలనాలతో 'కేజీఎఫ్-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక సినిమాలో 'అధీర'గా విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించనున్నారు. తాజాగా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. "అధీర మళ్లీ యాక్షన్‌ లోకి వచ్చాడు. కేజీఎఫ్ చాప్టర్-2 కోసం డబ్బింగ్ సెషన్‌ లు పూర్తయ్యాయి 2022, ఏప్రిల్ 14 న థియేటర్‌లలోకి రాబోతున్నాం" అంటూ సంజయ్ దత్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

Also Read: 'పుష్ప' విల‌న్ ఎవ‌రి కొడుకో తెలుసా?

హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యశ్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com