కారెక్కనున్న ముత్యాలముగ్గు హీరోయిన్..!
on Sep 26, 2016

అవకాశాలు రాకపోవడమో..వయసు మీద పడటమో కారణమేదైనా వెండితెర వేల్పులకు ఉన్నట్లుండి రాజకీయాల మీదకు మళ్లుతుంది. అప్పటి వరకు గుర్తురాని ప్రజలు గుర్తొచ్చేసి ప్రజాసేవ చేసేయాలనుకుంటారు. ఇలా ఎంతోమంది తారలు లీడింగ్‌లో ఉన్న పార్టీల్లో చేరడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తాజాగా ముత్యాల ముగ్గు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో బాపు బొమ్మగా నిలిచిపోయిన సీనియర్ నటి సంగీత కూడా రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టాలనుకుంటోందట. హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత.
అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మళ్లీ బిజీ అయ్యారు. అయితే ఈవిడ మనసు రాజకీయాల వైపు లాగుతోందట. ఈ విషయం సంగీత స్వయంగా చెప్పారు. గతంలో ఎంతోమంది నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేశారు. అప్పుడు నేను ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పొలిటిక్స్‌లోకి రావాలనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నారని తన మనసులో మాట బయటపెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



