మైఖేల్ జాక్సన్ బయోపిక్.. డైరెక్టర్ సందీప్ రెడ్డి.. హీరో..?
on Aug 31, 2025

మైఖేల్ జాక్సన్.. ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సింగర్ గా, డ్యాన్సర్ గా ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మైఖేల్ జాక్సన్ జీవితంలో విజయాలు, విషాదాలు, వివాదాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఆయన జీవిత కథను వెండితెరపై చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటి మైఖేల్ జాక్సన్ బయోపిక్ కి సందీప్ రెడ్డి వంగా దర్శకుడైతే ఎలా ఉంటుంది?. (Michael Jackson Biopic)
మైఖేల్ జాక్సన్ బయోపిక్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి(కబీర్ సింగ్), యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. తన తదుపరి సినిమా 'స్పిరిట్'ని ప్రభాస్ తో చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు మైఖేల్ జాక్సన్ బయోపిక్ చేయాలని ఉందని సందీప్ రెడ్డి అన్నారు. అయితే ఆ పాత్ర పోషించడానికి మన దగ్గర ఎవరున్నారు? అనేదే అసలు ప్రశ్న అని సందీప్ అభిప్రాయపడ్డారు. (Sandeep Reddy Vanga)
సందీప్ రెడ్డి మాటలను బట్టి చూస్తే.. మైఖేల్ జాక్సన్ పాత్రకు న్యాయం చేయగల నటుడు ఉన్నాడని అనిపిస్తే.. ఆయన బయోపిక్ చేయాలని ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆ రోల్ కి రణబీర్ కపూర్ న్యాయం చేస్తాడని హిందీ ఆడియన్స్ అంటుంటే.. అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో సందీప్ రెడ్డి ఈ ఇద్దరిలో ఎవరితోనైనా మైఖేల్ జాక్సన్ బయోపిక్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



