
మూవీ లవర్స్ కి పరిచయం అక్కర్లేని పేరు సమ్రీన్ కౌర్(. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసి తన కట్ అవుట్ రేంజ్ ని పెంచుకోవడంతో పాటు మోడల్ గాను సత్తా చాటుతూ వస్తుంది. కొన్ని రోజులుగా ప్రముఖ క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ తో లవ్ లో ఉందనే ప్రచారం రూమర్స్ రూపంలో చెలామణి అవుతూ వస్తుంది.
ఇప్పుడు ఆ రూమర్ ని నిజం చేస్తూ అర్షదీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్ కౌర్‌తో కలసి ఉన్న రెండు ఎంతో రొమాంటిక్, క్యూట్ పిక్చర్స్‌ను షేర్ చేస్తూ, "మై పర్సన్" (My Person) అని ఒక చిన్న, ఆప్యాయతతో కూడిన క్యాప్షన్ జోడించాడు. ఎటువంటి సుదీర్ఘమైన వివరణలు ఇవ్వకుండా, కేవలం ఆ రెండు ముక్కల క్యాప్షన్‌తోనే తన మనసులోని భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వైరల్ అయింది. షార్ట్ పీరియడ్ లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి 2.2 మిలియన్లకి పైగా లైక్స్ రావడం విశేషం.
Also read: రామాయణ ట్రైలర్ ఆ మూవీతో పాటు రాబోతోందా!
అర్ష్‌దీప్, సమ్రీన్ల మధ్య డేటింగ్ నడుస్తోందనే ప్రచారం ఈనాటిది కాదు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రోత్సహించడానికి సమ్రీన్ కౌర్ మైదానానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో, అలాగే చండీగఢ్‌లో జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరై ఆమె ఉత్సాహంగా చీర్ చేస్తూ కనిపించింది. అంతకంటే ముందు ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్‌కి ముందు వీరిద్దరూ కలసి చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తున్న ఒక వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Samreen kaur, Bollywood







