Sampoornesh Babu: సోదరుడితో కలిసి పెళ్ళి దుస్తుల్లో సంపూ.. ఇదేందయ్యా ఇది!
on Nov 6, 2023
ఇటీవల 'మార్టిన్ లూథర్ కింగ్'తో ప్రేక్షకులను పలకరించిన సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం 'సోదరా'. ఇందులో సంపూతో పాటు సంజోష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా.
ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తుండగా ఈరోజు(నవంబర్ 6న) మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సంపూర్ణేష్ బాబు, సంజోష్ ఇద్దరు పెళ్లి కొడుకు గెటప్ లో.. ఒకరు తాళి, ఒకరు రోజా పువ్వు పట్టుకొని ఉండగా వెనక మేళతాళాలతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమా అత్యంత హాస్య భరితంగా ఉండేలా దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అలాగే సినిమాను కూడా త్వరలోనే తీసుకురావడానికి ప్రేక్షకుల ముందుకు సన్నాహాలు చేస్తున్నారు.
క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిలిమ్స్ పతాకాలపై చంద్ర చగంలా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రాచీ బన్సాల్, ఆర్తి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. సునీల్ కశ్య ప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డీఓపీగా జాన్, ఎడిటర్ గా శివశర్వాణి వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
