వంట పేరు చెబితే... మంటెత్తిపోతోంది
on Apr 11, 2018
ఆడవాళ్లంటే వంటలు, ముగ్గులు, చీరలు, వాషింగ్ మిషన్లూ అనుకున్న జమానా పోయింది. వాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. మగవాళ్లకంటే ఓ మెట్టుపైనే ఉన్నారు. అయినా సరే - కథానాయికలు కనిపించేసరికి `మీకు వంట వచ్చా` అనే ప్రశ్న అడగడం కామన్ అయిపోయింది. చాలామంది కథానాయికలు ఇలాంటి ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానాలు ఇస్తారు. తమ ఫీలింగ్స్ అన్నింటినీ లోలోపల దాచుకుంటూ - పైపైన మాట్లాడుతుంటారు. అయితే సమంత అలా కాదు. వంట పేరెత్తేసరికి... ఆమెకు మండిపోతోంది. `ఆడవాళ్లు వంట చేయాలని రూలేమైనా ఉందా` అంటూ ఎదురుప్రశ్నిస్తోంది. అమ్మాయిలు చంద్రమండలం నుంచి దిగినా ఈ ప్రశ్న వేయడం మానరు కదా?? అంటూ మీడియా ముందు తన అసహనాన్ని వ్యక్తం చేసింది సమంత. తను వంట చేయదట. నేర్చుకునే ఉద్దేశమూ లేదట. చైతూ మాత్రం బాగా వండి పెడుతుంటాడని, తాను తింటుంటుందని చెబుతోంది. వంట విషయంలో ఆడవాళ్లు, అందునా కథానాయికలు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కాస్త విచిత్రంగానే ఉంటుంది. కిపిటప్ సమంతా... ఇలానే మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేయ్!!