పెళ్లి గురించి అడగొద్దని చెబుతున్న సమంత..!
on May 24, 2016
తెలుగు తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది సమంత. అభిమానగణం కూడా చాలా హెవీగా ఉండే సమంత గురించి ఏం చెప్పినా, నిముషాల్లో పాకిపోతుంటుంది. రీసెంట్ గా ఆమె పెళ్లి గురించిన పుకార్లు కూడా అలాగే చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. తన ట్విట్టర్లో నేను మంచి గర్ల్ ఫ్రెండ్ ను కాదు అని ట్వీట్ చేయడం, ఒక ఇంటర్వ్యూలో సింగిల్ గా ఎవరున్నారు అంటూ డబుల్ మీనింగ్ లో డైలాగ్ వేయడం, పెళ్లి హైదరాబాద్ అబ్బాయితోనే జరుగుతుందని క్లియర్ గా చెప్పేయడం లాంటివన్నీ ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోశాయి.
దీంతో సమంత పెళ్లి కన్ఫామ్ అయిపోయిందని, ఒక పెద్ద సినీ హీరో తనయుడితో ఆమె ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి అతన్ని పెళ్లి చేసుకుని సెటిలైపోతుందని చాలా మంది సినీజనాలు ఫిక్సై పోయారు. ఈ రూమర్లన్నింటిపై తన ట్విట్టర్లో స్సందించింది సమంత. తను చెప్పేవరకూ తన పెళ్లి గురించి మాట్లాడద్దు అంటూ స్ట్రాంగ్ గా ట్వీట్ చేసిందీ భామ. ప్రస్తుతం బ్రహ్మోత్సవంతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న సమంత ఆశలన్నీ, జూన్ 2న రాబోయే అ..ఆ మీదే ఉన్నాయి.