Home

»

Latest News

హీరోయిన్ సమంత బాయ్ ఫ్రెండ్ ఎవరు..?

May 11, 2016 1:47PM

ప్రస్తుతం సమంత కెరీర్ ఫుల్ స్పీడ్ గా దూసుకుపోతోంది. లెక్కలేనంత మంది అభిమానులు, స్టార్ స్టేటస్, అందం ఇవన్నీ కలగలిపిన సమంతకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? ఉంటే ఎవరు..? ఇవీ ఇప్పుడు సినీజనాల్లో నలుగుతున్న ప్రశ్నలు. ఇప్పుడు సడెన్ గా ఈ ప్రశ్నలు రావడానికి కారణం ఉంది. రీసెంట్ గా సమంత ఇచ్చిన కొన్ని స్టేట్ మెంట్స్ జనాల మైండ్స్ లో డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. మదర్స్ డే రోజున తన ట్విట్టర్లో, నేను మంచి కూతుర్ని కాదు, మంచి గర్ల్ ఫ్రెండ్ కాదు అంటూ ట్వీట్ చేసింది. ఆ రోజున తన తల్లితో ఉండలేకపోతున్నాననే బాధతో ఈ పోస్ట్ చేసిందిలే అని సరిపెట్టుకున్నా, మంచి గర్ల్ ఫ్రెండ్ కాదు అన్న మాట ఎందుకు ట్వీట్ చేసిందా అనేది జనాల డౌట్.

ఇక 24 సినిమా హిట్టైన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో, సింగిల్ గా లైఫ్ ఎలా ఉంది అని అడగ్గానే, సింగిల్ గా ఎవరున్నారు అంటూ లాస్ట్ పంచ్ వేసి ఎస్కేప్ అయిపోయింది. ఆ స్టేట్ మెంట్ తర్వాతే డౌట్స్ మరింత స్ట్రాంగ్ అయిపోయాయి. సమంత బాయ్ ఫ్రెండ్ ఎవరా అని ఇండస్ట్రీలో అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. గతంలో సిద్దార్ధతో ప్రేమాయణం నడిపినా, ఆ వ్యవహారానికి ఎండ్ కార్డ్ పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ భామ ఎవరితోనూ కెమేరాకు చిక్కలేదు. సరదాగా టీజ్ చేస్తుందా లేక మీడియా కంటబడకుండా ప్రేమ వ్యవహారం దాస్తోందా..! చూద్దాం..నిజం నిలకడ మీద తెలియక తప్పదుగా..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com