అలిసిపోయిందట..గ్యాప్ తీసుకుంటానంటోంది..!
on Jun 11, 2016
.jpg)
కొంత మందికి పని ఉంటే చాలు ఇక ఏమీ అక్కర్లేదు. అవసరమైతే తిండీ తిప్పలు మానేసి కష్టపడుతుంటారు. ఇలాంటి క్యాటగిరీలోకే వస్తుంది సమంత. వరసగా నాలుగు సినిమాల్లో ఒకేసారి నటించడం, అది కూడా 8 నెలల టైం గ్యాప్ లో చేయడం మామూలు విషయం కాదు. డేట్స్ అడ్జెస్ట్ మెంట్ తో పాటు, ఇంత వర్క్ లోడ్ ను మ్యానేజ్ చేయడం కూడా కష్టమే. అయితే ఎలా చేసిందో కానీ సమంత వీటన్నింటినీ సక్సెస్ ఫుల్ గా మ్యానేజ్ చేసేసింది. ఆమె కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చిందీ సమ్మర్ సీజన్.
బ్రహ్మోత్సవం తప్పితే సమంత నటించిన మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ సాధించాయి. తేరీ, 24, అ ఆ సినిమాలు రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేశాయి. ప్రస్తుతం జనతాగ్యారేజ్ లో చేస్తున స్యామ్, ఆ సినిమా తర్వాత రిలాక్స్ అవ్వాలనుకుంటోందట. ఇన్నాళ్లూ పడ్డ స్ట్రెస్ అంతా రిలీవ్ అవ్వాలంటే వెకేషన్ తీసుకోవడమే కరెక్ట్ అని ఫీలవుతోందట. దీంతో పాటు స్కిన్ కు ట్రీట్ మెంట్ తీసుకోవడానికి కూడా ఈ గ్యాప్ ను ఉపయోగించుకోవాలనుకుంటోందట. ఈ కారణంగానే సమంత కొత్త సినిమాలేవీ ఒప్పుకోవట్లేదని అంటున్నారు సినీజనాలు. కష్టపడిన దానికి కాస్త రిలాక్స్ అవడంలో తప్పులేదులే పాపా..! కానీ పోటీ గట్టిగా ఉంది చూసుకో మరి..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



