షూటింగ్ ఎగ్గొట్టాలంటే ఏం రీజన్ చెప్పాలో..!
on Jun 8, 2016
పొద్దున్న లేవగానే బయటి వాతావరణం చినుకులు పడుతూ డల్ గా ఉంటే, ఎలా అనిపిస్తుంది. ఇంకాసేపు పడుకోవాలనో, లేక ఈరోజు సెలవు పెట్టాలనో అనిపిస్తుంది. ఈ విషయంలో ఎవరూ మినహాయింపు కాదు. ఇప్పుడు ఇదే ఫీలింగ్ లో ఉంది ముద్దుగుమ్మ సమంత. తన మనసులో ఏది ఉంటే అది వెంటనే ట్వీట్ చేసే స్యామ్, పొద్దున్న లేవగానే హైదరాబాద్ వెదర్ ను చూసి ఫ్లాట్ అయిపోయిందట. ఇలాంటి క్లైమేట్ లో షూటింగ్ కు వెళ్లాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. ఈరోజు జనతా గ్యారేజ్ షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. మానేయాలంటే డైరెక్టర్ కొరటాల శివకు ఏ రీజన్ చెప్పాలో అర్ధం కావట్లేదు అంటూ ట్వీట్ చేసింది సమంత. షూటింగ్ ఎగ్గొట్టాలంటే ఏం కారణం చెప్పాలో సూచిస్తూ సమంత అభిమానులు కూడా రిప్లై లు ఇస్తున్నారు. అయినా షూటింగ్ కు డేట్స్ ఇచ్చేసిన కారణంగా పాపం వెళ్లక తప్పలేదు ఈ భామకు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా..!