సమంతను చైతూకు దూరం చేసిన చరణ్..
on Jun 27, 2017

అదేంటి సమంతను చైతూకు దూరం చేయాల్సిన అవసరం చరణ్‌కు ఏముంది అనే కదా..? ఏమి లేదండి..? సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. రాజమండ్రి సమీపంలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. గత వారం నుంచి ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుండటంతో చిత్ర యూనిట్‌కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎవ్వరి ఫోన్లకు సిగ్నల్ అందకపోవడంతో కొంతమంది టెక్నీషియన్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల్లో పెళ్లీపీటలెక్కబోతున్న సమంత తనకు కాబోయే భర్త నాగచైతన్యతో తాను ఎక్కడ ఉన్నా ఫోన్‌లో టచ్‌లో ఉంటోంది. అయితే గత వారం నుంచి తాను చైతూ గొంతు వినలేదట. దీంతో కాస్త ఇబ్బందిగా ఫీలవుతోందట..సెట్‌లో ఉన్న చెర్రీ ఆమెతో కబుర్లు చెప్పి మూడ్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడట.. ఈ విషయాన్ని సమ్ ట్విట్టర్‌లో పెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



