పెళ్లి గురించి చైతూ చెప్పిన సీక్రెట్స్
on Oct 5, 2016
.jpg)
సమంతతో నాగచైతన్య పెళ్లి ఖాయమైంది. వచ్చే యేడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ పెళ్లి అటు క్రిస్ట్రియన్ , ఇటు హిందూ సంప్రదాయ ప్రకారం జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగచైతన్య కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మీ పెళ్లి రెండు సార్లు జరుగుతుందా? అని అడిగితే ''రెండు సార్లు జరిగితే... రెండు సెలబ్రేషన్స్ లా ఉంటుంది కదా?? అదీ బాగానే ఉంటుంది'' అంటూ పరోక్షంగా తన పెళ్లి రెండు సార్లు జరుగుతుందని హింట్ ఇచ్చేశాడు. పెళ్లి తరవాత సమంత సినిమాల్లో కొనసాగుతుందని మరోసారి క్లియర్ కట్‌గా చెప్పాడు చైతూ.
తన కెరీర్ కోసం సమంత చాలా కష్టపడిందని, సినిమాపై ఫ్యాషన్ ఉన్న వ్యక్తి అని తాను సినిమాల్లో కొనసాగడమే బెటర్ అంటున్నాడు చైతూ. అంతే కాదు తన పెళ్లి కంటే ముందు తమ్ముడు అఖిల్ పెళ్లే జరుగుతుందట. ''ముందు అఖిల్ పెళ్లే జరుగుతుంది. ఇదంతా తన నిర్ణయమే. తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇంత చిన్న వయసులో మెచ్యూర్డ్‌గా ఆలోచించడం మాకు షాక్ ఇచ్చింది'' అంటూ తమ్ముడిని తెగ పొగిడేస్తున్నాడు చైతూ. సో.. సమంత - చైతూల పెళ్లి విషయంలో వచ్చిన డౌట్లన్నీ క్లియర్ అయిపోయినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



