
సమంత మరింత స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. తను అనుకున్నది అనుకున్నట్లు పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక బంధం నుండి వేరు పడిన తర్వాత నుండి ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉంటున్నారు. విజయ దశమికి రెండు కొత్త సినిమాలు ప్రకటించారు. తర్వాత చార్ ధామ్ యాత్రకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు.
సమంతతో పాటు మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్, స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఉన్నారు. సమంత విడాకుల తర్వాత దీనంతటికీ ప్రీతమ్ కారణమని కొందరు వదంతులు సృష్టించారు. దానికి ప్రీతమ్ వివరణ ఇచ్చారు. సమంతను తాను అక్క అని పిలుస్తానని, చైతన్యకు కూడా ఈ విషయం తెలుసునని, ఈ విధమైన పుకార్లు సృష్టించడం సరికాదని ఆవేదన చెందాడు. అయినా వందతులు ఆగలేదు. దాంతో సమంత కోర్టుకు ఎక్కారు. సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఎటువంటి విషయాలు ప్రసారం చేయకూడదనీ, రాయకూడదపీ కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
సమంతపై వచ్చే వందతులకు ఇకపై చెక్ పడుతుందని ఆశించవచ్చు. ఓ వైపు ప్రజల్లో ఈ చర్చ జరుగుతోంది. మరోవైపు సమంత తన పనుల్లో తాను ఉన్నారు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్ సహా సమంత వెడుతున్నారంటే... ఏదైనా యాడ్ షూటింగ్ ఉందేమో..





(1).webp)

