నన్నుఇబ్బంది పెట్టింది ఇదే..మార్పు నాతోనే మొదలవ్వాలి
on Apr 14, 2025
స్టార్ హీరోయిన్ సమంత(Samantha)గత ఏడాది తెలుగులో ఎటువంటి చిత్రంలో కనిపించకపోయినా వరుణ్ ధావన్(Varun Dhavan)తో కలిసి చేసిన హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీబన్నీ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సిరీస్ అంతగా హిట్ అవ్వకపోయినా సమంత నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా కష్టపడి చేసిందనే కితాబుని అందుకున్న సమంత ప్రస్తుతం తెలుగులో 'మాఇంటి మహాలక్ష్మి' అనే మూవీ చేస్తుంది.టైటిల్ రోల్ ని తనే పోషించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తోంది.
రీసెంట్ గా సమంత ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఒక సినిమాలో నటీనటులిద్దరు సమానమైన డిమాండ్ ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పటికీ,వారికి వచ్చే రెమ్యునరేషన్ లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది.ఒకేలా కష్టపడినా కూడా,ఆ తేడా మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది.ఇండస్ట్రీలో నన్ను ఇబ్బంది పెట్టే అంశాల్లో ఇది కూడా ఒకటి.అందుకే రెమ్యునరేషన్ అంశం పునరావృతం కాకుండా మార్పు తీసుకురావాలని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.గత పరిస్థితుల్నినేను మార్చలేను.కానీ మార్పు నాతోనే మొదలవ్వాలి.అందుకే నా సంస్థలో పనిచేసే వాళ్ళమధ్య అలాంటి వ్యత్యాసం రాకుండా చూసుకుంటున్నానని సమంత చెప్పుకొచ్చింది.
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన'ఏ మాయచేసావే'తో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పటి వరకు తెలుగులో ఇరవై తొమ్మిది సినిమాలు చెయ్యగా అందులో సుమారు ఇరవై ఐదు వరకు హిట్ సినిమాలే.దీన్ని బట్టి తెలుగు చిత్ర సీమపై సమంత ప్రాభవాన్ని అర్ధం చేసుకోవచ్చు.పలు తమిళ చిత్రాల్లో కూడా నటించి హిట్ ని అందుకుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
