సలార్ ఫస్ట్ రివ్యూ.. డైనోసార్ దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
on Dec 21, 2023
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తోంది.
ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ముఖ్యంగా 20 నిమిషాల నిడివిగల ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ.. ఒకసారి కథలోకి వెళ్ళాక, తన మార్క్ సీన్స్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉందట. పతాక సన్నివేశాలు, పార్ట్ 2 కోసం చేసిన సెటప్ అదిరిపోయాయట. ఫైట్స్, హీరో ఎలివేషన్ సీన్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కోసమైనా.. ఈ సినిమాను చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖంగా స్క్రీన్ మీద ప్రభాస్ కటౌట్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉందట.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
