ఎవడు టూర్ లో సాయికుమార్ విలనిజం
on Jan 21, 2014
రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర సకెస్స్ టూర్ లో ఉత్సాహంగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో సాయికుమార్ విలన్ పాత్రలో, ప్రముఖ నటుడు ఎల్.బి.శ్రీరామ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సక్సెస్ టూర్ లో పాల్గొన్న ఎల్.బి. మాట్లాడుతూ సినిమాలోని తన డైలాగ్ ను చెబుతూ, విలన్ (సాయి కుమార్) పై చమత్కారంగా డైలాగ్ విసిరాడు. దానికి సాయికుమార్ స్పందిస్తూ.. ఎల్.బి.శ్రీరామ్ గొంతును పట్టుకొని తన విలనిజం చూపించాడు. కంగారు పడకండి.. అది కూడా సరదాగా మాత్రమే చేసాడు. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతుంది.