Home

»

Latest News

రావణుడు చెడ్డోడు కాదు: సాయిపల్లవి వ్యాఖ్యలు వైరల్!

Oct 29, 2026 4:01PM


రామాయణతో సీతమ్మ వారుగా సత్తా చాటి పూజలు అందుకునే ముహూర్త వేళకి సాయి పల్లవి(రామాయణ రిలీజ్ డేట్ నవంబర్ 5 ] కూతవేటు దూరంలో ఉంది. ఈ మేరకు టీంతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాయిపల్లవి రావణుడిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతు 'రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు.. మనలోని రావణుడిని మనం గుర్తించాలి. రామాయణాన్ని కేవలం ఒక పవిత్ర గ్రంథంగా చదవడమే కాకుండా, అందులోని క్యారక్టర్ ల ద్వారా మనలోని మంచి చెడులని బేరీజు వేసుకోవాలి. కాలక్రమేణా మనిషి తన తప్పులను సరిదిద్దుకోవాలి. మనలో దాగి ఉన్న ఆ అహంకారాన్ని లేదా చెడు ఆలోచనలను గుర్తించి మార్పు తెచ్చుకోవడమే అసలైన రామాయణ అంతరార్థం అని చెప్పుకొచ్చింది.


 ఇది కూడా చదవండి: అలీపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం: పేరు చెప్పకపోవడం ఏంటి!

 


 అయితే సీతగా కనిపిస్తున్న సాయి పల్లవి రావణుడి గురించి ఇలా మాట్లాడటం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నెటిజన్లు సీతగా నటిస్తూ రావణాసురుడిని సమర్థించేలా మాట్లాడటాన్ని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం ఆమె మాటలను సమర్థిస్తూ, రావణుడిలో గొప్ప శివభక్తుడిగా, పండితుడిగా ఉన్న మంచి కోణాలను ప్రస్తావించడంలో తప్పులేదని, ఆమె ఉద్దేశం మనుషుల్లోని అంతర్గత చెడును మార్చుకోవాలనే తప్ప రావణుడిని కీర్తించడం కాదని వాదిస్తున్నారు.   

 

 

 

[Sai Pallavi About Ravana Character Comments, Sai Pallavi, Ramayana movie, Ravana is not all bad, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com