'సామి సామి' అంటూ రచ్చ చేస్తున్న రష్మిక!
on Oct 28, 2021
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'పుష్ప'. ఇందులో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ, శ్రీవల్లి పాత్రలో రష్మిక అలరించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి' సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
'సామి సామి' అంటూ సాగే పుష్ప మూడో సాంగ్ ఆకట్టుకుంటోంది. ఫోక్ టచ్ తో డీఎస్పీ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ ఎనెర్జిటిక్ గా ఉంది. పుష్ప రాజ్ ని ఉద్దేశించి శ్రీవల్లి పాడుకునే ఈ పాటకు చంద్రబోస్ అందించిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఈ సాంగ్ ఆలపించిన మౌనిక యాదవ్.. తన వాయిస్ తో మ్యాజిక్ చేసింది. ఇక లిరికల్ వీడియోలో రష్మిక పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ స్టెప్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'పుష్ప' రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప : ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read