'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌కి మళ్లీ పెళ్లి!
on Oct 24, 2018
అవును... 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మళ్లీ చేసుకుంది. లాస్ట్ టైమ్ తెలుగు నటుడు ఒకరిని పెళ్లి చేసుకుంటే... ఈసారి తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్‌ని పెళ్లి చేసుకుంది. నిజంగా ఆమె ఇద్దరిని ఆమె పెళ్లి చేసుకుందా? అని షాక్ అవ్వకండి. ఎందుకంటే... ఈ పెళ్లిళ్లు సినిమాల వరకూ మాత్రమే పరిమితం!
సెన్సేషనల్ హిట్ 'ఆర్ఎక్స్ 100'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తెలుగులో ఆమెకు అదే తొలి సినిమా. అందులో ఆమెది హీరో కార్తికేయను ప్రేమించే పాత్ర. సారీ... ప్రేమించినట్టు నటించే పాత్ర! తన అవసరం కోసం హీరోని వాడుకుని, తరవాత తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. అలా తొలి తెలుగు సినిమాలో పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో పాయల్ నటించింది. ఇప్పుడు తమిళ తెరకు పాయల్ పరిచయం అవుతోంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్న 'ఏంజిల్' సినిమాలో ఆమె హీరోయిన్. అందులోనూ పెళ్లి సన్నివేశం వుంది. ఇటీవల ఆ సన్నివేశాన్ని తెరకెక్కించిన ఫొటోను పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ విధంగా తొలి తమిళ సినిమాలోనూ పాయల్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో నటిస్తున్నారన్న మాట! నటీనటులకు ఇంతే... తెరపై పెళ్లిళ్లు చాలా జరుగుతాయి. 'యమలీల' సినిమాలో 'మా చెల్లికి మళ్లీ పెళ్లి' అన్నట్టు... హీరోయిన్‌కి మళ్లీ మళ్లీ పెళ్లి అన్నట్టు!